Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

మౌలానా అబుల్‌ కలాం సేవలు మరువలేనివి

విశాలాంధ్ర`ఉరవకొండ : కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి అబుల్‌ కలాం ఆజాద్‌ భారతదేశానికి చేసిన సేవలు మరువలేనని పలువురు వక్తలు కొనియాడారు. ఆయన 135 వ జయంతి వేడుకలు శుక్రవారం అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో ఘనంగా జరిగాయి. వైఎస్‌ఆర్సీపీ ముస్లిం మైనారిటీలు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. స్థానిక పంచాయితీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆజాద్‌ మైనార్టీల అభ్యున్నతికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. విద్యావ్యవస్థలో ఆయన చేసిన విప్లత్మకమైన మార్పులను కొనియాడారు.క్రమశిక్షణ, ఆలోచనతో యువత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అగ్రి అడ్వైజరి బోర్డు చైర్మన్‌ రాజశేఖర్‌ రెడ్డి, ఎంపీపీ చందా చంద్రమ్మ, జెడ్పిటిసి ఏసీ పార్వతమ్మ, వైస్‌ ఎంపీపీ నరసింహులు, ఉప సర్పంచ్‌ వన్నప్ప, పిఏసీఎస్‌ చైర్మన్‌ వడ్ల షేక్షావలి, కో అప్షన్‌ మెంబర్‌ పామిడి సలీమ్‌, అన్వర్‌, జీలన్‌, జాకీర్‌,అసిఫ్‌, హుస్సేన్‌, వడ్ల సలీమ్‌, షంశు, మాజీ ఎంపీపీ ఏసీ ఎర్రిస్వామి, బసవరాజు,ఉలిగప్ప, పంచాయతీ ఈఓ గౌస్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img