Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

యన్‌.హెచ్‌. యం ఉద్యోగుల క్యాలెండర్‌ ఆవిష్కరణ

విశాలాంధ్ర ..అనంతపురం వైద్యం : యన్‌. హెచ్‌. యం ఉద్యోగుల సంఘం క్యాలెండర్‌ ను జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కే వీరబ్బాయి , అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుజాత , జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ యుగంధర్‌ , జిల్లా క్షయ నివారణా అధికారి డాక్టర్‌ అనుపమ జేమ్స్‌ , డీపీఎం ఒ డాక్టర్‌ చేన్నకేశవులు , అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి మోసెస్‌ ప్రభాకర్‌ , ఎన్‌ హెచ్‌ ఎం డిస్ట్రిక్ట్‌ ప్రోగ్రాం మేనేజర్‌ కిషోర్‌ గురువారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా యన్‌.హెచ్‌. యం ఉద్యోగులు డి.యం అండ్‌ హెచ్‌ ఓ దృష్టికి వరుసగా 5 రోజుల సెలవులను ఉపయోగించు కొనెలా తగిన ఆదేశాలను ఇవ్వాలని అడుగగా జిల్లా వైద్యాధికారి ఇటీవల హెచ్‌ ఆర్‌ ఐ ఎస్‌ వెబ్సైట్‌ నందు ఉపయోగించుకొనే లీవు ల సంఖ్యను 2 నుండి 5 మార్చారు మీరు కా వాలాంటే 5 రోజల సాధారణ సెలవులను ఉపయోగించు కోవచ్చని తెలియజేశారు.
ఈ సందర్భంగా గౌరవ జిల్లా వైద్యాధికారి కి ఎన్‌ హెచ్‌ ఎం ఉద్యోగులు పుష్పగుచ్చం ఇచ్చి ధన్యవాదములు తెలియజేశారు.
ఈ కార్యక్రమములో ఎన్‌ హెచ్‌ ఎం జె ఏ సి గౌరవ అధ్యక్షులు శ్రీధర్‌ బాబూ, అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి, జయవర్దన్‌, వేణుగోపాల్‌, మహేష్‌, ప్రేమ్‌, శ్రీనివాస్‌, రామలింగ, రామ శివారెడ్డి, నారాయణ, ఖాదర్‌, సుమన్‌, నారాయణ స్వామి, సుబ్బు, తులసి, రేవతి, శశికళ, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img