Sunday, April 2, 2023
Sunday, April 2, 2023

యస్ కె యూనివర్శిటీ వైస్ చాన్సలర్ ను సస్పెండ్ చెయ్యాలి..

డాక్టర్ ఆదిశేషు ..జనవిజ్ఞాన వేదిక
విశాలాంధ్ర -ధర్మవరం : ధన్వంతరి మహా మృత్యుంజయ శాంతి హోమం పేరుతో మూఢనమ్మకాలను విశ్వవిద్యాలయంలో వ్యాప్తి చేస్తున్న యస్ కె యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ను సస్పెండ్ చేయాలని జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు విఙ్ఞానాన్ని అందించాలి గానీ,అజ్ఞానంలో కి నెట్టేయ్యకూడదన్నారు. భావిభారత పౌరులను విజ్ఞాన వంతులుగా తయారుచెయ్యవలసిన బాధ్యత విశ్వవిద్యాలయాల మీదఉన్న దన్నారు. కానీ ఈరోజు విశ్వవిద్యాలయాలు ఒక అజ్ఞానం వెదజల్లే కేంద్రాలుగాను , అధికారపార్టీలకు జైకొట్టే కేంద్రాలుగాను తయారు కావడం దారుణమన్నారు. అనంతపూర్లోని శ్రీకృష్ణ దేవరాయ యూనివర్శిటీ లో ఈనెల 24 ధన్వంతరీ మృత్యుంజయ శాంతి హోమం చెయ్యటానికి , ఆ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ ఒక జివో విడుదలచెసి , అక్కడపనిచేస్తున్న టీచింగ్ స్టాఫ్ ఒక్కొక్కళ్ళు 500 రూపాయాలు , నాన్ టీచింగ్ స్టాఫ్ ఒక్కొక్కళ్లు 100 రూపాయల లెక్కన ఇవ్వాలని , రిజిష్ట్రార్ లక్ష్మయ్య ఒక సర్క్యులర్ విడుదల చేసాడశీటే వైస్ చాన్సలర్ ఎంత అజ్ఞానంలో వున్నాడో అర్థమవుతుందన్నారు. అక్కడ తరచు కొంతమంది విద్యార్థులు , అధ్యాపకులు చనిపోతున్నారని , దాని నివారణకొరకు మృత్యుంజయయాగం నిర్వహిస్తున్నట్లు అధికారులుచెప్తున్నారు.
చనిపోతుంటే శాస్త్రీయమైన కారణాలని కనుగొని, నివారించేందుకు చర్యలుతీసుకొకుండా ఇలాంటి యాగాలు , హోమాలు చేయడమెంటన్నారు ? అని వారు ప్రశ్నించారు. ఈవిదంగా యజ్ఞయాగాలు చెయ్యటం ఇదిపూర్తిగా రాజ్యంగా వ్యతిరేక చర్య అన్నారు. ఇంతటి అజ్ఞాని, మూఢనమ్మకాలను పెంచిపోషించే వ్యక్తి కి వైస్ చాన్సలర్ గా వుండే అర్హత లేదన్నారు.ఒకప్రక్క ప్రపంచములోని మానవుడు, ఇతరగ్రహాలలో కాపురం పెట్టెందుకు ఉరకలు వెస్తుంటే , మనం మాత్రం విశ్వవిద్యాలయాలలో భూతవైద్యము , ఆవు మూత్రము , మృత్యుంజయ యాగము , వాస్తూ , జ్యోతిష్యం , మంత్రాలు అంటు వెనక్కి , ఆటవిక సమాజంలోకి వెళ్ళిపోతున్నామన్నారు.
ఇదిచాలా సిగ్గుపడాల్సిన విషయమన్నారు
మనిషిని కోసి, బతికించగల డాక్టరులు సైతం ఆమధ్య గాంధీ అస్పత్రిలో మృత్యుంజయ యాగం చేసారంటే, మూఢనమ్మకాలు మనదేశంలొ ఏస్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు నని తెలిపారు.ఒక యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఈవిధమైన అఙ్ఞానపు , అనాగరికపు , ఆటవికపు , చాంధసపు భావాలకు లోనుకావడం చాలావిచారకరమన్నారు.
ఇలాంటి మూఢనమ్మకాలకు విశ్వవిద్యాలయాలు వేదిక బాధాకరం అని,
మనం చదివే చదువులు తార్కికంగా ఆలోచించడం, నేర్పించడం లేదనడానికి ఇదో నిదర్శనం అన్నారు..
కనుక తక్షణమె అనంతపుర్ యస్ కె యూనివర్శిటీ వైస్ చాన్సలర్ ను సస్పెండ్ చేసి , రిజిష్ట్రార్ జారీచేసిన జీవోను రద్దుచేసి , భవిష్యత్తులో ఇలాంటి ఛాదస్తపు ,అనాగరికపు పనులు ఎవరూ చెయ్యకుండా తగుజాగ్రత్తలు తీసుకొవా లని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img