కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన మహిళా నేత
విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ పట్టణము లో తెదేపా కార్యాలయం కార్యాలయం నందు గురువారం రొద్దం, సోమందేపల్లి,పరిగి, గోరంట్ల మండలశీ లోని నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ ,టీడీపీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం యువగళం పాదయాత్ర మన నియోజకవర్గంలోని గోరంట్ల మండలం లోని గౌనివారిపల్లి గ్రామం వద్ద ప్రవేశిస్తున్న సందర్బంగా మీరందరు గ్రామాల్లో టీడీపీ నాయకులను,కార్యకర్తలను ,మహిళలను ప్రజలను పెద్దఎత్తున తరలించి పాల్గొని విజయవంతం చేయాలనీ పాదయాత్ర లో మీరందరు నడచి నారా లోకేష్ బాబుకి మద్దతుగా ఉండాలని తెలియ చేశారు అనంతరం యువగలం పాదయాత్ర పోస్టుర్లు విడుదల చేసారు ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.