Sunday, June 11, 2023
Sunday, June 11, 2023

యువగళం పాదయాత్ర విజయవంతముచేసినందుకు ధన్యవాదాలు

ఎమ్మెల్యే శంకర్ నారాయణ పై మండిపడ్డ మహిళా నేత

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ పట్టణము నందు శుక్రవారం తెలుగుదేశం పార్టీ సవితమ్మ కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహకనిర్వాహక కార్యదర్శి సవితమ్మ మాట్లాడుతూ నారా లోకేష్ యువగలం పాదయాత్ర విజయవంతవానికి కృషిచేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ స్థానిక శాసనసభ్యులు మాల గుండ్ల శంకర్ నారాయణ పై మండిపడ్డారు ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ
శంకర్ నారాయణ చదువుకున్న అజ్ఞాని మళ్లీ నీకు సవాల్ విసురుతున్న నేను పక్కా లోకల్ నా వ్యాపారాలు పక్కా లీగల్.సొంత పార్టీలోనే వ్యతిరేకత రావడంతో మైండ్ దొబ్బి ఏమి మాట్లాడుతున్నాడో అతనికేఅర్థం కావట్లేదు. గత ఐదు రోజులుగా పెనుకొండ నియోజకవర్గంలో యువగళం రథసారథి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పెనుకొండ నియోజకవర్గంలో పాదయాత్ర విజయవంతం అవ్వడంతో వైసీపీలో వణుకు పుట్టింది. అదేవిధంగా గత నాలుగు సంవత్సరాలు వైసిపి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజల విసిగిపోయి పెద్ద ఎత్తున యువత మహిళలు పాల్గొని తమ సమస్యలను లోకేష్ బాబు కి విన్నపించుకున్నారు.
నన్ను డీజిల్ దొంగ అంటున్నాడు అధికారంలో ఉన్నది నువ్వు నీ పార్టీనే నీకు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించు.నిన్ను ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజలకు ఏం చేయాలో ఆలోచించు .
తల్లి పాలు తాగి రొమ్మును గుద్దడం నీకు బాగాఅలవాటైపోయింది.
నిన్ను ఎన్నుకున్న నీ వైసీపీ కార్యకర్తలని నాయకులను కేసులు పెట్టించిన ఘనత నీది నువ్వా నా గురించి మాట్లాడేది మిస్టర్ శంకర్ నారాయణ..
నేను సవాల్ విసురుతున్నది ఎమ్మెల్యే శంకర్ నారాయణ కి ఎటువంటి అవినీతి అక్రమాలు చేయని ద్వితీయ శ్రేణి వైసిపి నాయకులు కాదు నాకు సమాధానం చెప్పాల్సింది ఎమ్మెల్యే శంకర నారాయణ
వైసిపి పార్టీ కార్యకర్తలు కూడా యువగళం పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలియజేశారు
నియోజకవర్గం అభివృద్ధి కోసం నారా లోకేష్ కి పలు సమస్యలు విన్నపించాం అధికారంలోకి రాగానే అన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
మహిళలకు యువతకు అన్ని విధాలుగా ప్రాధాన్యత ఇస్తాం
మా పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు మీలాగా మీ పార్టీలో ముఖ్య నాయకులు వచ్చినప్పుడు మీ మీద చెప్పులు విసిరినారు సొంత పార్టీ కార్యకర్తలే నాయకులే చెప్పులతో వేయించు కున్న మీకు ఇంకా సిగ్గు రాలేదా శంకర్ నారాయణ అంటూ మండి పడ్డారు ఆమెతోపాటుగా మాధవ నాయుడు శ్రీరామ్ యాదవ్ ప్రసాద్ సూర్యనారాయణ వాసుదేవ రెడ్డి త్రివేంద్ర సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img