Friday, June 9, 2023
Friday, June 9, 2023

యువ రైతు కుటుంబాని సన్మానించిన జై కిసాన్ ఫౌండేషన్

విశాలాంధ్ర -ఉరవకొండ : ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండలం గంజిగుంట గ్రామానికి చెందిన యువ రైతు అమృత్ సాగర్ అమృత వాణి దంపతులు ఆదర్శవంతమైన వ్యవసాయ విధానాన్న కొనసాగిస్తున్నందుకు జై కిసాన్ ఫౌండేషన్ అధ్యక్షులు నాగమల్లి ఓబులేసు ఆధ్వర్యంలో శనివారం రైతు పొలంలోనే దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాగమల్లి ఓబులేసు మాట్లాడుతూ తనకున్న 10 ఎకరాల భూమిలోనే బొప్పాయి, దానిమ్మ, చెరుకు, అల్లనేరేడు,అనప, మిరప, వేరుసెనగ తదితర కూరగాయల సాగు చేస్తూ,అధిక దిగుబడులను సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు
అమృత సాగర్ అమృతవాణి దంపతులు తనకున్న పది ఎకరాల పొలంలో అన్ని పంటలు వేసుకోగా మిగిలిన ఒకటిన్నర ఎకరం పొలంలో కిందటి సంవత్సరం సెప్టెంబర్ మాసంలో డబ్బి రకపు మిరప నారు నాటారు, ఇప్పుడు మిరపకాయలు కోస్తున్నారు,దాదాపుగా 18 నుంచి 20 కింటాల్లా మిరప దిగుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా యువ రైతు దంపతుల మాట్లాడుతూ మిరప నారు నాటినప్పటి నుంచి పంట కోత వరకు నిత్యం ప్రతి వారము జై కిసాన్ ఫౌండేషన్ బృందము పొలంలో పంట సందర్శన,పరిశీలన,పరిష్కార మార్గాలు తెలియజేస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు వచ్చేలా మాకు సూచనలను సలహాలు ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే నీటి, పోషక యాజమాన్య పద్ధతులను,పురుగులు నల్లి, తెగుళ్లు నివారణ చర్యలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ,అవసరం మేరకే రసాయన ఎరువులు, రసాయన పిచికారి మందులను తెలియజేస్తూ, పిచికారి చేయిస్తూ సేంద్రియ మరియు నాచురల్ ఫార్మింగ్ పద్ధతులను నేర్పిస్తూ మా విజయానికి గెలుపు బాటలు వేసిన నాగమల్లి ఓబులేష్,జై కిసాన్ ఫౌండేషన్ బృందానికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జై కిసాన్ ఫౌండేషన్ బృందం రమేష్, సురేంద్ర పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img