Sunday, April 2, 2023
Sunday, April 2, 2023

రథోత్సవములో విద్యుత్ సరఫరా బంద్.. డిఈఈ.. నాగేంద్ర

విశాలాంధ్ర ..ధర్మవరం : పట్టణంలోని శివానగర్ లో గల శ్రీ బచ్చు నాగంపల్లి కాశీ విశ్వనాథ స్వామి దేవాలయంలో ఈనెల 18వ తేదీ మహాశివరాత్రి సందర్భంగా రథోత్సవము నిర్వహించబడును. ఈ సందర్భంగా 18వ తేదీ పట్టణంలోని కేశవ నగర్, శివానగర్, గీతా నగర్, గుడ్డి బావి వీధి, చెన్నూరు గ్రామం, చిన్నూరు రోడ్డు, చిన్నూరు, సంజయ్ నగర్, నేసే పేట నందు ఉదయం 6:30 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ డిఈఈ..నాగేంద్ర ,ఏఈ. నాగభూషణం గురువారం పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రథోత్సవం సందర్భంగా ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా పూర్తిగా ఉదయం నుండి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేయడం జరుగుతుందని, ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని వారు కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img