Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

రాటు తేలిన కుక్కల దాడులకు భయాందోళనలకు గురవుతున్న గుంతకల్లు ప్రజలు…

విశాలాంధ్ర-గుంతకల్లు : జిల్లాలో ఎక్కువ జనాభాగా గుర్తింపు పొందిన గుంతకల్లు పట్టణంలో సుమారు రెండు లక్షల మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారు అయితే విస్తీర్ణం పెరగడంతో పాటు కాలనీలు కూడా పెరిగిపోయాయి దినసరి చర్యగా జీవనం కోసం వెళ్తున్నటువంటి కార్మికులువిద్యార్థులు ఉద్యోగులు వృద్ధులు మహిళలు ద్విచక్ర వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు ఎందుకంటే ప్రతి వీధిలో ఎక్కడ చూసినా 10 15 కుక్కలు ఒక్కసారిగా దాడులకు తెగబడుతున్నాయి అయితే ఇందులో గాయపడిన వ్యక్తులు వీధులలో తిరగాలంటేనే భయాందోళన గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా మటన్‌ మార్కెట్ల వద్ద చికెన్‌ సెంటర్‌ ల వద్ద కుక్కలు గుంపులు గుంపులుగా వీరంగం చేస్తున్నాయి. కుక్కల బెదడ లేకుండా చేసేందుకు మున్సిపాలిటీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారనవచ్చు. ఎన్నోసార్లు కుక్కల దాడుల విషయంపై కమిషనర్‌ కి వివరించిన కుక్కల విషయంలో జోక్యం చేసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలే తెలంగాణలో కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందిన విషయం విధితమే. అయితే జరగబోయే సంఘటనను దృష్టిలో పెట్టుకొని కుక్కల బెదడను అరికట్టేందుకు మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img