Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికైన జీవనజ్యోతి పాఠశాల విద్యార్థులు

విశాలాంధ్ర`ధర్మవరం : హాకీ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో ఈనెల 28 నుండి 30వ తేదీ వరకు విశాఖపట్నంలో జరగనున్న 13వ రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ హాకీ పోటీలకు శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలోని జీవనజ్యోతి ఉన్నత పాఠశాల చదువుతున్న 9వ తరగతి విద్యార్థులు శశాంక్‌, మహమ్మద్‌, అశ్వక్‌, అభిషేక్‌, 8వ తరగతి విద్యార్థులు శబరీష్‌ గౌడ్‌ లు ఎంపిక కావడం జరిగిందని హెచ్‌ఎం సిస్టర్‌ రaాన్సీయా కరెస్పాండెంట్‌ సిస్టర్‌ మేత్సూసు తెలిపారు. ఈ సందర్భంగా వారు మంగళవారం మాట్లాడుతూ మా పాఠశాలలో చదువుతోపాటు క్రీడా రంగాల్లో కూడా విద్యార్థులు తమ ప్రతిభను చూపడం జరుగుతుందన్నారు. అనంతరం ఆ విద్యార్థులను హెచ్‌ఎం, కర్రీస్పాండెంట్‌ తో పాటు ఉపాధ్యాయ బృందం, తోటి విద్యార్థులు అభినందించి హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img