Friday, March 31, 2023
Friday, March 31, 2023

రాష్ట్ర సిపిఐ కార్యదర్శి రామకృష్ణ ను సన్మానించిన టిడిపి నాయకులు

విశాలాంధ్ర -ఉరవకొండ : పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికలలో వైసిపి అభ్యర్థులను ఓడించి పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ శనివారం ఉరవకొండలో ప్రచారం నిర్వహించేందుకు వచ్చిన సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణను స్థానిక టిడిపి పార్టీ నాయకులు తమ కార్యాలయానికి ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం యొక్క దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడడానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలు కూడా ఒకే వేదిక పైకి రావలసిన అవసరం ఆసన్నమైందన్నారు. గడిచిన నాలుగు సంవత్సరాలగా విడివిడిగా పార్టీలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ రాబోయే రోజుల్లో కలిసికట్టుగా పార్టీలన్నీ కూడా ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలన్నారు, పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికలలో పరస్పర అవగాహనతో వైసిపి అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు ఎన్నికల రోజు జరిగే అక్రమాలను కలిసికట్టుగా అడ్డుకోవాలన్నారు,ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి సి జాఫర్, సహాయ కార్యదర్శులు నారాయణస్వామి, మల్లికార్జున, కార్యవర్గ సభ్యులు కేశవరెడ్డి తో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పురుషోత్తం, మాజీ ఎంపీపీ సంకరత్నమ్మ, మండల కన్వీనర్ విజయభాస్కర్, పార్టీ నాయకులు గోవిందు వెంకటేశులు,తిమ్మప్ప, ఎర్రి స్వామి, టిడిపి, సిపిఐ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img