Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

రెండు రైళ్లలో చోరీలు

సుమారు 30 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన దుండగులు….
విశాలాంధ్ర-గుంతకల్లు : అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే జంక్షన్‌ ఔటర్‌ లో నిలిపిన రెండు రైళ్ల లో దొంగలు రెచ్చిపోయారు. గుంతకల్లు రైల్వే జంక్షన్‌ లో నిలిచిఉన్న రైళ్లను దొంగలు టార్గెట్‌ చేసి రెచ్చిపోతున్నారు. తాజాగా గుంతకల్లు రైల్వే జంక్షన్‌ లో బీదర్‌, కర్ణాటక, ఎక్స్ప్రెస్‌ రైలులో భారీగా చోరీ జరిగింది రైలు కదులుతున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు రైల్లో ప్రయాణిస్తున్న నలుగురు మహిళల వద్ద నుండి బంగారు ఆభరణాలను లాక్కేల్లారు.,మరో ప్రయాణికుడు వద్ద ఉన్న నగల బ్యాగును దొంగిలించి దొంగలు పారిపోయారు. మొత్తం ముగ్గురు నుండి 30 తులాల బంగారు నగలు అపహరణకు గురైనట్లు రైళ్ల ప్రయాణిస్తున్న ప్రయాణికుల సహాయంతో బాధితులు గుంతకల్లు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img