మొబైల్ బ్లడ్ కలెక్షన్ వ్యాన్ సేవలను ఉపయోగించుకోవాలి
: జిల్లా కలెక్టర్ యం. గౌతమి
విశాలాంధ్ర- అనంతపురం వైద్యం : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలు మరింత విస్తరించేందుకు మొబైల్ బ్లడ్ కలెక్షన్ వ్యాన్ ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ యం. గౌతమి పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్ ప్రాంగణంలో కెనడియన్ రెడ్ క్రాస్ వారిచే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, జిల్లా శాఖకి అందజేసిన మొబైల్ బ్లడ్ కలెక్షన్ వ్యాన్ ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొబైల్ బ్లడ్ కలెక్షన్ వ్యాన్ లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. జిల్లాలో ఎక్కడ రక్త దాతలు ఉన్న బస్సు అక్కడికి వెళ్లి బస్సులోనే శాంపిల్స్ సేకరించేందుకు ఆకాశముంటుందని, ఇందులో రక్తమార్పిడి సౌకర్యం కూడా ఉందని, 100 శాంపిల్స్ స్టోర్ చేసుకునే రెఫ్రిజిరేటర్ కూడా ఈ వ్యాన్లో అమర్చబడి ఉందన్నారు. ఎటువంటి ప్రమాదాలు జరిగినా లేదా అత్యవసర పరిస్థితి నెలకొని రక్తం అవసరం ఉన్నా వ్యాన్ వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. అన్ని సౌకర్యాలు కలిగిన ఒక కోటి రూపాయలు విలువచేసే ఈ వ్యాన్ ను కెనడియన్ రెడ్ క్రాస్ వారిచే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, జిల్లా శాఖకి అందజేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాల వారు కూడా మొబైల్ బ్లడ్ కలెక్షన్ వ్యాన్ సేవలను ఉపయోగించుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా అత్యవసర పరిస్థితి ఉంది ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడి రక్తం అవసరం ఉన్న సమయాల్లో మెరుగైన సేవలు అందించేందుకు ఈ వ్యాన్ ఎంతో తోడ్పడుతుందన్నారు. మొబైల్ బ్లడ్ కలెక్షన్ వ్యాన్ సేవలను చక్కగా ఉపయోగించుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాయిస్ ఛైర్మెన్ డా.లక్ష్మణ్ ప్రసాద్, సెక్రెటరీ మోహన్ కృష్ణ, కోశాధికారి మల్లికార్జున, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, డిఎంహెచ్ఓ డా. యుగంధర్, ఈసీ మెంబర్ డా.మనోరంజన్ రెడ్డి, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.