Tuesday, March 21, 2023
Tuesday, March 21, 2023

రేగాటిపల్లి రైల్వే గేట్ మూత

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని రేగాటిపల్లి రోడ్డు లో గల రైల్వే గేట్ ను శనివారం ఉదయం 6 గంటల నుండి ఆదివారం ఉదయం 6 గంటల వరకు రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరమ్మత్తులు ఉన్నందున రైల్వే గేటును తెరువబడదని పెనుకొండ రైల్వే విభాగం సీనియర్ సెక్షన్ ఇంజనీర్ సుదాన్స్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వే ట్రాక్ల యొక్క మరమ్మతులు వేగవంతంగా నిర్వహించాల్సి ఉన్నందున, ప్రస్తుతం రేగాటిపల్లి రైల్వే గేటును ఒక రోజు పాటు మూసివేస్తున్నట్లు తెలిపారు. కావున పట్టణ ప్రజలు సహకరించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img