Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

రైతులకు జలకళ పథకం మోటారు పంపుసెట్లు పంపిణీ

విశాలాంధ్ర -ఉరవకొండ : ఉరవకొండ మండలం షేక్షాన్ పల్లిలో వైఎస్సార్‌ జలకళ పథకం కింద బోరు వేసిన లత్తవరం, అమిద్యాల గ్రామాలకు చెందిన 9 మంది రైతులకు గురువారం ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర రెడ్డి ఉచిత మోటారు పంపుసెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ..నాడు పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కొక్కటిగా ఇప్పటి వరకు 98 శాతం హామీలు అమలు చేసారని చెప్పారు.అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా అర్హత గలిగినటువంటి చిన్న సన్నకారు రైతులకు ఃవైస్సార్‌ జలకళఃలో భాగంగా బోరు మొదలుకుని పంపుసెట్లు, మోటార్లు, ఇతర సామగ్రి కింద దాదాపు రూ.5లక్షల వరకు ఉచితంగా ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న ఈ చేయూతను రైతులు సద్వినియోగం చేసుకుని వ్యవసాయంలో లాభపడాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, వైయస్సార్‌ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img