Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

రైలు బోగీలో గుర్తుతెలియని వ్యక్తి మృతి.. ఆచూకీ తెలపండి..

ధర్మవరం రైల్వే జి ఆర్ పి పోలీసులు
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని రైల్వే స్టేషన్లో ఆదివారం రాత్రి సమయంలో రైల్వేటేషన్ ప్లాట్ఫారం రెండు నందు మైసూర్ బాగల్కోట్ అనే రైలు బోగీలో గుర్తుతెలియని 60-70 సంవత్సరముల గల వ్యక్తి ఏ కారణం చేతనో మృతి చెందాడని జి ఆర్ పి రైల్వే ఎస్సై గోపి కుమార్ పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ రైలు బోగీలోనే మగ వ్యక్తి చనిపోవడం జరిగిందని, చనిపోవడానికి గల కారణాలు ఇంకను మా విచారణలో తెలియాల్సి ఉందని తెలిపారు. మృతుడు నారింజ రంగు పిస్తా గ్రీను రంగు సగం చొక్కా, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని తెలిపారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు ఎవరికైనా తెలిస్తే సెల్ నెంబర్ 9440 627640 లేదా సమాచారం అందించాలని వారు తెలిపారు. తదుపరి జి ఆర్ పి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img