Monday, March 20, 2023
Monday, March 20, 2023

రైల్వే ఆస్తులపై నష్టం కలిగిస్తే తీవ్రమైన చర్యలు తీసుకుం టాశీ.. రైల్వే ఆర్పిఎఫ్.సీఐ.. బోయ కుమార్

విశాలాంధ్ర- ధర్మవరం : ధర్మవరం రైల్వే డివిజన్ పరిధిలో రైల్వే ఆస్తుల పై దాడి చేసి నష్టం కలిగిస్తే తీవ్రమైన చర్యలను తీసుకుంటామని రైల్వే ఆర్పిఎఫ్ సిఐ బోయ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం వారు మాట్లాడుతూ భారతీయ రైల్వే అధికారుల ఆదేశాల మేరకు ఇకనుంచి రైల్వే ఆస్తులపై ఎటువంటి దాడులు చేసిన ఉ పచించేది లేదని, రైల్వే చట్టం ప్రకారం కఠిన చర్యలతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందని తెలియజేశారు. రైల్వే స్టేషన్, ఇతర చోట్ల మైనర్ లేదా మేజర్ తప్పిపోతే నూతనంగా రైల్వే వారు ఏర్పాటు చేసిన భారతీయ వెబ్సైట్లో నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఎఫ్ఐఆర్ కన్నా ముందు తప్పిపోయిన వారి గురించి ప్రాథమిక సమాచారాన్ని తొలత ఈ వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుందన్నారు. ఈ వెబ్సైట్లో తప్పిపోయిన వారి పూర్తి వివరాలు తెలియ పరచడం జరుగుతుందన్నారు. ఇటీవలే టెక్నాలజీతో వందే భారత్ రైలుపై దాడులు జరిగిన విషయాన్ని వారు గుర్తు చేస్తూ, భారత ప్రభుత్వం ఇటీవలే సీరియస్ గా విషయాన్ని తీసుకుందని, పరిణామాలు కఠినంగా ఉంటాయని తెలియజేశారు. ఈ భారతీయ వెబ్ సైట్ లోని పలు విషయాలను మా పరిధిలోని గ్రామ ప్రజలకు పూర్తి దశలో అవగాహన కల్పించి, రైల్వే ఆస్తులకు చట్ట భద్రత కల్పించడం జరుగుతుందన్నారు. ట్రాకులపై రాళ్లు, కట్టెలు ఉంచుట, రాళ్లతో దాడులు చేయుట పూర్తి చట్ట విరుద్ధమని తెలిపారు. దీనివల్ల ప్రయాణికులకు కూడా తీవ్ర గాయాలు అయ్యే అవకాశం ఉంటుందని వారు తెలియజేశారు. కొంతమంది యువకులు, మద్యానికి బానిసైన వారు సరదాగా తీసుకొని ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి వారికి కఠిన శిక్షలు దాదాపు మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందన్నారు. రైల్వే ఆస్తులను కాపాడటంలో తాము ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి, వారి సహాయ సహకారాలను తీసుకుంటామని తెలిపారు. రైల్వే ఆస్తులను కాపాడటంలో, రైళ్లకు, రైళ్లలో ప్రయాణం చేసే ప్రయాణికులకు, పూర్తి భద్రతను నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని తెలిపారు. రైల్వే ఆస్తులపై లేదా దాడులను సరదాగా తీసుకుంటే, జీవితం అంధకారమవుతుందని తెలిపారు. కావున రైలు ఆస్తులను కాపాడటం ప్రజలకు కూడా బాధ్యత కలదని వారు గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img