Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

రైల్వే డబ్లింగ్ ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన సి ఆర్ఎస్ అధికారి. ప్రన్ జీవ్ సక్సేనా

విశాలాంధ్ర-ధర్మవరం : గుత్తి నుండి ధర్మవరం డబ్బింగ్ రైల్వే ప్రాజెక్ట్ పనులను సౌత్ సెంట్రల్ జోన్ కమిషనర్ రైల్వే సేఫ్టీ ఆఫీసర్ ప్రణ్ జీవ్ సక్సేనా ఆకస్మికంగా బుధవారం ధర్మవరంలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైల్వే విభాగాలకు సంబంధించిన గుంతకల్ జంక్షన్ నుంచి వివిధ విభాగాల రైల్వే అధికారులతో పాటు, స్థానిక రైల్వే అధికారులు కూడా వారికి స్వాగతం పలుకుతూ ధర్మవరం నుండి కారులో చిగిచెర్ల రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. అక్కడ ఉండి మోటార్ ట్రాలీలో చిగిచెర్ల నుండి ధర్మవరం వరకు జరిగిన డబుల్ లైన్ పనులను ఉదయం 10 గంటల నుండి రెండు గంటల వరకు క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ వచ్చారు. అనంతరం అక్కడక్కడ చిన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి, సత్వరమే పరిష్కరించాలని వారు ఆదేశించారు. తదుపరి ధర్మారం చేరుకున్న వారు వివిధ విభాగాల కార్యాలయాలతో పాటు రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం, సేఫ్టీ పనులపై కూడా దృష్టి పెట్టి అక్కడున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ రైల్వే డబుల్ నైన్ పనులు నాణ్యతగా ఉన్నాయా లేదా అన్న వాటిపై తాను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగిందని, నా తనిఖీ నివేదికను రైల్వే ఉన్నతాధికారులకు తెలపడం జరుగుతుందని వారు తెలిపారు. త్వరలోనే డబల్ నైన్ రైల్వే పట్టాలపై రైలు ప్రయాణం చేస్తాయని తెలిపారు. ప్రయాణికులకు సౌకర్యంగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని, ఎక్కడా ఎటువంటి లోపాలు లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఈ డబుల్ రైల్వే పనులు పూర్తి కావడంతో ధర్మవరం ప్రజలకు మరింత సుఖవంతమైన ప్రయాణం రైలు ద్వారా చేకూరుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ రైల్వే మేనేజర్ కె.వి.రెడ్డి, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లకు సంబంధించిన వివిధ విభాగాల అధికారులు, స్టేషన్ మేనేజర్ నరసింహ నాయుడు, రైల్వే ఆర్పిఎఫ్ సీఐ బోయ కుమార్, రైల్వే జి ఆర్ పి సి ఐ నాగరాజు తోపాటు స్థానిక రైల్వే అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img