రైల్వే సహాయ మంత్రిని కోరిన ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి
విశాలాంధ్ర-ఉరవకొండ : బిజెపి ప్రభుత్వం దేశంలో రైల్వే శాఖను ప్రైవేటీకరించడానికి దశలవారీగా ముందుకు వెళుతుందని అలా ప్రైవేటీకరించడం వల్ల పేద మరియు మధ్య తరగతి ప్రజల నష్టపోవడమే కాకుండా రైల్వే శాఖలో పని చేసే పన్నెండు లక్షల మంది ఉద్యోగస్తుల భవితవ్యం ప్రశ్నార్ధకమవుతుందని ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగస్తులు తీవ్రంగా నష్టపోతారని కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలను ఉపసంహరించుకోవాలని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రావు సాహెబ్ పాటిల్ దన్వే ని కలిసి ఎమ్మెల్సీ వై శివరాం రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం గుంతకల్లు రైల్వే డివిజన్ ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన కేంద్ర సహాయ మంత్రిని ఎమ్మెల్సీ కలిసి పలు సమస్యలను విన్నవించారు స్వతంత్ర భారతదేశంలో పేద, మధ్యతరగతి ప్రజలు 60 శాతం మంది ఉన్నారని, వీరందరి సౌలభ్యం కోసం ప్రభుత్వ రంగ సంస్థగా రైల్వే శాఖ గత కొన్ని సంవత్సరాలుగా సేవలందిస్తోందని ఇలాంటి శాఖను ప్రైవేట్ సంస్థల చేతిలో పెట్టడం ప్రభుత్వం యొక్క అసమర్థత కింద వస్తుందన్నారు. తక్షణమే ఇలాంటి చర్యలను ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్సీ విజ్ఞప్తి చేశారు. గుంతకల్లు నుండి రాయదుర్గానికి ఉన్నటువంటి రైల్వే లైను దాదాపు 100 కిలోమీటర్ల దూరం కలిగి ఉందని కాబట్టి గుంతకల్లు నుండి కళ్యాణదుర్గానికి కొత్తగా రైల్వే లైన్ వయా ఉరవకొండ బెలుగుప్ప మీదుగా ఏర్పాటు చేసినట్లయితే దాదాపు 20 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని, అంతేకాకుండా ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడుతుందని కాబట్టి కొత్త రైల్వే లైన్ నిర్మించడానికి సాధ్యసాధ్యులను పరిశీలించి వెంటనే మంజూరు చేయాలని దీనిపై మంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపి ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్సీ శివరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.