గుంతకల్లు టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆర్.జితేంద్ర గౌడ్
విశాలాంధ్ర-గుంతకల్లు : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు చేపట్టిన యువగళం పాదయాత్ర ఈనెల 15వ తేదీ నాటికి 100 రోజులు పూర్తి అవుతున్న సందర్భంగా లోకేష్ బాబుకి సంఘీభావంగా పాదయాత్ర చేపడుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేంద్ర గౌడ్ అన్నారు.శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జితేంద్ర గౌడ్ మాట్లాడుతూ 15వ తేదీన యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గుంతకల్లు పట్టణంలోని మస్తానయ్య దర్గా లో నారా లోకేష్ బాబు పేరు మీద ప్రత్యేక చదివింపులు చదివించి అనంతరం తీసుకుని అనంతరం పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. ఈ పాదయాత్రకు గుంతకల్లు మండలంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు,యువకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టిడిపి లీగల్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణారెడ్డి, టిడిపి నాయకులు జి.వెంకటేష్ ,తలారి మస్తానప్ప,రంజాన్,కురుబ శివన్న, కురుబ సురేష్ తదితరులు పాల్గొన్నారు.