Sunday, May 28, 2023
Sunday, May 28, 2023

వడదెబ్బపై అవగాహన

విశాలాంధ్ర – ఉరవకొండ : ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామంలో గురువారం వేసవికాలంలో తగిలే వడదెబ్బ గురించి హెల్త్ ఎడ్యుకేటర్ ఎస్ ఎండి షఫీ,సి హెచ్ ఓ నాగ రంగయ్య అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉష్ణోగ్రతలు బాగా పెరుతుండడం వలన ఆరుబయట ఎండలో పనులకు పోవడం వలన వడదెబ్బ తగిలే అవకాశం ఉందన్నారు. ప్రజలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండల్లో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.ఎండలో బయటకు వెళ్ళవలసి ఉంటే కాలికి చెప్పులు ధరించి,తలకు టోపి గాని రుమాలు ధరించాలని లేదా గొడుగు వేసుకొని వెళ్లాలని సూచించారు.పలుచటి నూలు దుస్తులు ధరించాలని,నల్లటి దుస్తులు ధరించారాదని తెలిపారు. ఎవరైనా ఎక్కువ సమయం నేరుగా ఎండలో పనిచేస్తే వడదెబ్బ సోకే ప్రమాదం ఉందని తలనొప్పి,తలతిరగడం,అధిక జ్వరం,నీరసం,నాలుక ఎండిపోవడం మగతగా ఉండడం స్పృహ కోల్పోవడం వడ దెబ్బ లక్షణాలని తెలిపారు.ఎవరిలోనైనా వడ దెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే అతనికి నీడపాటున చేర్చి దుస్తులు వదులుగా చేసి విసన కర్రతో విస్తూ వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలని,ఉష్ణోగ్రత తగ్గేవరకు తడిగుడ్డతో వొళ్ళంతా తుడవాలని తెలిపారు.ఓఆర్ ఏస్ ద్రావణం,కొబ్బరి నీరు మజ్జిగ నీరు ఎక్కువగా తీసుకోవాలని, కూల్ డ్రింక్స్ మసాలా పదార్థాల జోలికి వెళ్లరాదని కోరారు.ఎండకు పోకుండా,వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ శ్రీ దర్ మూర్తి,స్వర్ణలత,సచివాలయ ఎయన్ఎమ్ పద్మావతి,సీఓ భగవన్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img