Tuesday, June 6, 2023
Tuesday, June 6, 2023

వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన బ్రోచర్ విడుదల

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీ సత్యసాయి జిల్లా శాఖ మంగళవారం పుట్టపర్తి లో ఎండ త్రీవ్రత గూర్చి అవగాహన గోడపత్రికలను మేనేజింగ్ కమిటీ మెంబర్ హెచ్ రజిత దేవి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఎండ తీవ్రత ఉన్నప్పుడు వృద్ధులు, చిన్నారులు గొడుగు గాని,టోపి గాని,తెల్లటి కాటన్ వస్త్రాలు ధరించాలన్నారు. వీలైనంత వరకు ఇంట్లో ఉండడానికి ప్రయత్నించాలని,తరచుగా నీటిని తాగాలని ఉప్పు కలిపిన మజ్జిగ,గ్లూకోజ్,
నిమ్మరసం, కొబ్బరి నీరు తప్పకుండా తీసుకోవాలన్నారు.ఇంటి వాతావరణం చల్లగా ఉంచుకోవాలని ఎండ తీవ్రత తగ్గినంతవరకు బయట తిరగరాదన్నారు. డిహైడ్రేషన్ చేసే ఆల్కహాల్ టీ కాఫీ మరియు కార్బొనేటెడ్ శీతలపానీయాలు ఉపయోగించరాదని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ బి.రమేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img