Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలి

విశాలాంధ్ర- బొమ్మనహళ్‌: రాష్ట్రవ్యాప్తంగా వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలని అనంతపురం జిల్లా వడ్డెర సంఘ అధ్యక్షుడు రామకృష్ణ లక్ష్మన్న డిమాండ్‌ చేశారు బుధవారం బొమ్మనహళ్ళలో స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 216వ జయంతి వేడుకలు మండల వడ్డెర్ల సంఘ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి జరుపుకున్నారు అనంతరం ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ మన దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఏమాత్రం ఎదుగుదలలేదు ఉన్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినా వడ్డెరలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించలేదన్నారు అనంతపురం జిల్లాలో నిర్మాణ రంగంలోని వడ్డెర్లు ప్రాజెక్టులు చెరువులు, భవనాలు ఆలయాలు గోపురాలు నిర్మించడంలో వడ్డెర్ల పాత్ర ఉంది పనిచేస్తు ప్రమాదాలకు గురైన వారి కుటుంబాలకు ప్రభుత్వం 50 లక్షల రూపాయలు ఇవ్వాలి 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్‌ సౌకర్యం కల్పించాలి వడ్డెర్లు రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలంటే ప్రతి ఒక్కరూ తమ పిల్లలను బాగా చదివించినప్పుడే అన్ని రంగాల్లో రాణించగలమన్నారు ఈ కార్యక్రమంలో వడ్డెర్ల సంఘం రాయదుర్గం తాలూకా నాయకులు వడ్డే వన్నూరప్ప వడ్డే రాముడు దురదప్ప వడ్డెర్ల సంఘం మండల అధ్యక్షులు శాంత్‌ కుమార్‌ ఉపాధ్యక్షులు మధు ప్రతాప్‌ మల్లికార్జున రమేష్‌ వంశి అనిల్‌ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img