Friday, June 9, 2023
Friday, June 9, 2023

వాల్మీకి విద్యార్థులను ప్రోత్సహించేందుకు తమ వంతు కృషి

విశాలాంధ్ర-రాప్తాడు : సామాజికంగా, విద్యాపరంగా వాల్మీకి విద్యార్థులు రాణించే విధంగా తమ వంతు సాయం చేసేందుకు నిరంతరం కృషి చేస్తామని అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వాల్మీకి ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న వాల్మీకి ప్రతిభా పురస్కారాలను అందజేయడంలో భాగంగా తమవంతు బాధ్యతగా భావించి రూ.50వేల నగదును జెడ్పీ చైర్మన్ దంపతులు చైర్మన్ బోయ గిరిజమ్మ, డి. నరసింహమూర్తి వాల్మీకి ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులకు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ ఆర్సీ అకులప్ప, శ్రీనివాసులు, భాగ్యరాజ్, రామాంజనేయులు,
ఈశ్వర్, జయశంకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img