Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

విజ్ఞాన శిబిరాలను సద్వినియోగం చేసుకోండి.

విశాలాంధ్ర -తాడిపత్రి: పట్టణంలోని శాఖా గ్రంధాలయంలో సోమవారం వేసవి విజ్ఞాన శిబిరాలు ప్రారంభమైనట్లు గ్రంథాలయ అధికారి రవికుమార్ నాయుడు చెప్పారు. ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్ రిటైర్డ్ ఉపాధ్యాయులు ఎస్ వీరారెడ్డి, సూర్య నారాయణ రెడ్డి, హనుమంత రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వేసవి సెలవులలో ప్రతి విద్యార్థి గ్రంథాలయంలో గల కథల పుస్తకాలు, మహానుభావుల జీవిత చరిత్రలు, సైన్స్, క్విజ్, పురాణాలు, చరిత్ర వంటి అనేక రకములైన పుస్తకాలను చదువుకొని విజ్ఞానాన్ని పెంపొందించు కోవాల్సిందిగా విద్యార్థులకు సూచించారు. కావున విద్యార్థులు ఈ వేసవి విజ్ఞాన శిబిరాలలో పాల్గొని గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొనవలసిందిగా కోరడ మైనది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని గ్రంథాలయానికి పంపవలసిందిగా కోరడమైనది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img