Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

విదేశీ విద్యను దూరం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం…

విశాలాంధ్ర-గుంతకల్లు : విదేశీ విద్యను వైసిపి ప్రభుత్వం దూరం చేస్తున్నారని టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆర్‌ జితేంద్ర గౌడ్‌ ఆధ్వర్యంలో బుధవారం మొదటిగా అంబేద్కర్‌ కూడలి వద్ద టిడిపి నాయకులు నిరసన చేపట్టారు. అనంతరం మండల తాహసిల్దార్‌ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టి తాహసిల్దార్‌ బి.రాము కి వినతి పత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా పవన్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత విదేశీ విద్యాను దూరం చేయడమే కాకుండా టీడీపీ పై బురదజల్లే విమర్శలు చేయడం దారుణమన్నారు. వైసీపీ ప్రభుత్వంలో 210 మంది విద్యార్థులు కూడా విదేశీ విద్యాని పొందితే.. టిడిపి హయాంలో 4 వేల మంది విదేశీ విద్యను పొందారన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు కేశప్ప, మాజీ ఎంపిటిసి తలారి మస్తానప్ప ,మాజీ ఎంపీపీ అడ్వకేట్‌ ప్రతాప్‌ నాయుడు, టిడిపి తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు వాల్మీకి రాము,టిడిపి సర్పంచ్‌ అభ్యర్థి ఎస్‌ .రంజాన్‌, టిడిపి యువ నాయకులు తలారి శివ రమేష్‌, నాయకులు గున శేఖర్‌ , పులికొండ,అంజలి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img