Friday, February 3, 2023
Friday, February 3, 2023

విద్యాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత

ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి

విశాలాంధ్రIఉరవకొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి అన్నారు. గురువారం ఆయన వజ్రకరూరు మండలం లోని వజ్రకరూర్‌ ప్రభుత్వ హైస్కూల్‌, మోడల్‌, కస్తూరిబా, మరియు కొనకొండలో ప్రభుత్వ హైస్కూల్‌, మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ట్యాబ్‌ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవాడు కూడా ఇంగ్లీష్‌ తో పాటు ఉన్నత చదువులు చదవాలని సమాజంలో ఉన్న అంతరాలు తొలగిపోవాలని రాష్ట్రంలో డిజిటల్‌ విప్లవానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విద్యాసంక్షేమ ఫలాలను పేద మధ్యతరగతి విద్యార్థులు లబ్ధి పొంది ఉన్నత చదువులు పై ఆశలు పెంచుకున్నారన్నారు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను విద్యార్థులందరూ కూడా పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువులు చదవాలన్నారు విద్యతో సమాజంలో మంచి స్థానం పొందగలరని ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. వజ్రకరూరు మండల కేంద్రంలో జరిగిన పంపిణీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులు తో పాటు విద్యాశాఖ అధికారులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img