Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

విద్యార్థులకు ముగ్గుల పోటీలు

విశాలాంధ్ర-ఉరవకొండ : ఉరవకొండ పట్టణంలోని శ్రీ వాణీ విద్యానికేతన్ పాఠశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బుధవారం పాఠశాలలో విద్యార్థులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కారస్పాండెంట్ రఘు రాములు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశ సంస్కృతి,సాంప్రదాయాలు, ఆచారాలను, తెలుగు సంస్కృతిని, ప్రతిబింజించడమే పండుగలు యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. ఇటువంటి పండుగలను మరవకుండా, పండుగ వేడుకలను జరుపుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు. పండగ యొక్క గొప్పతనాన్ని సాంప్రదాయాన్ని మరవకూడదని నేటి తరానికి కూడా సంక్రాంతి పండుగ ముఖ్య ఉద్దేశం తెలియజేయడానికి ఈ ముగ్గుల పోటీ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పోటీలలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నప్పటికీ సరిత, శైలజ, భారతి విద్యార్థులు ప్రతిభ కనబరచడంతో బహుమతులను ప్రధానం చేయడం జరిగింది అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీలక్ష్మి ఉపాధ్యాయ బృందము, పెద్ద సంఖ్యలులో విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img