Friday, June 9, 2023
Friday, June 9, 2023

విద్యా, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలి

టిఎన్ఎస్ఎఫ్. రాష్ట్ర నాయకులు బి.రాజ శేఖర్

రాష్ట్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాల కు సంబంధించి విద్యార్థులకు బకాయి పడ్డ వసతి,విద్యా దీవెన మొత్తాలను తల్లుల ఖాతాల్లోకి జమ చేయకుండా పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తుందని తెలుగు నాడు విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు బి.రాజశేఖర్ అన్నారు. శుక్రవారం ఉరవకొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత తెలుగు దేశం ప్రభుత్వంలో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరు చేసేదని అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంబీఏ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ తీసేయడం, అలాగే విదేశీ విద్యను పూర్తిగా తీసివేయడం జరిగిందని ఇది ఉన్నత విదేశీ విద్య చదువుకునే విద్యార్థులకు శాపంగా మారిందని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి తీసుకొనే అనాలోచిత నిర్ణయాల వలన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న విద్యా,వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని పేర్కొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img