Sunday, May 28, 2023
Sunday, May 28, 2023

విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్సీ భూమి పూజ

విశాలాంధ్ర -ఉరవకొండ : ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామంలో 33/11 విద్యుత్తు సబ్ స్టేషన్ నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధుల ద్వారా 1.25 కోట్ల రూపాయల వ్యయంతో దీని నిర్మిస్తున్నట్లు తెలిపారు. సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయితే వజ్రకరూరు మండలంలో దాదాపు అనేక గ్రామాల్లో ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు అందుతుందన్నారు. ఉరవకొండ నియోజకవర్గం లో అవసరం ఉన్న చోట సబ్ స్టేషన్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి విజ్ఞప్తి చేయడంతో వెంటనే స్పందించి విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి సానుకూలంగా స్పందించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img