Monday, January 30, 2023
Monday, January 30, 2023

విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుంది..

నెహ్రు యువ కేంద్ర డిడిఓ.. శ్రీనివాసులు
విశాలాంధ్ర ` ధర్మవరం : విద్య ద్వారానే సమాజ అభివృద్ధి చెందుతుందని నెహ్రూ యువ కేంద్ర డిడిఓ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం అనంతపురంలోని కురుగుంట కస్తూరిబా విద్యాలయంలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అనుత నెట్వర్క్‌ సౌజన్యంతో ఎన్‌ కె సి సేవాసమితి ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించుట, అభినందనీయమని తెలుపుతూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తగిన ప్రోత్సాహం అందిస్తే, ఉన్నత స్థాయికి ఎదుగుతారని తెలిపారు పేదరికం చదువుకు ఎప్పుడు కూడా ఆటంకం కాకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్కేసి సేవాసమితి వ్యవస్థాపకులు కమలనాథ్‌, కస్తూరిబా విద్యాలయం ఎస్‌ఓ నర్మదా తోట నాగరాజు తో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img