Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

వివేకానంద అందరికీ ఆదర్శప్రాయుడు

విశాలాంధ్ర- ధర్మవరం : వివేకానంద అందరికీ ఆదర్శప్రాయుడని యోగా అసోసియేషన్ అధ్యక్షులు గాజుల సోమేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వివేకానంద జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని జీవీఈ జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం బాలికలకు యోగా కేంద్రం ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలను కూడా నిర్వహించారు. తదుపరి విజేతలకు మెమొంటోలను అందజేశారు. అనంతరం గాజుల సోమేశ్వర్ రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి లు మాట్లాడుతూ వివేకానందుడు ప్రపంచవ్యాప్తంగా ఆదర్శవంతులుగా మంచి పేరును, గుర్తింపును తెచ్చుకోవడం సంతోషదాయకమన్నారు. అనంతరం విద్యార్థులకు వివేకానంద జీవిత చరిత్ర, చికాగోలో జరిగిన ఉపన్యాసంలోని పలు అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో యోగా అసోసియేషన్ ఆర్గనైజర్ నరసింహులు, రామన్న, ఉపాధ్యాయులు, బోధ నేతర సిబ్బంది, అధిక సంఖ్యలో విద్యార్థినీలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img