వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా విశాఖ ఉక్కు ప్రైవేటుకరణకు మద్దతు తెలుపుతుంది
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వైయస్సార్ పార్టీ వ్యతిరేకమైతే వామపక్ష పార్టీ నాయకులను ముందస్తు అరెస్టులు ఎందుకు?
విశాలాంధ్ర- అనంతపురం వైద్యం : రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని రాస్తారోకో కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో బుధవారం రాస్తోరోకో కార్యక్రమానికి వెళ్లకుండా ముందస్తుగా పోలీసులు ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వడం తో సిపిఐ మండల కార్యదర్శి సనప నీళ్లపాల రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అరెస్ట్ అయిన మాత్రాన ఉద్యమాలు ఆపలేరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే విధానములో ప్రజలు గమనిస్తున్నారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని లేనిపక్షంలో అన్ని పార్టీలు ప్రజా సంఘాలుకలుపుకొని భారీ ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాము.