Monday, June 5, 2023
Monday, June 5, 2023

వీధి దీపాలు ఏర్పాటు చేయించిన వసికేరి మల్లికార్జున

విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ మేనేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని 15వ వార్డులో భాగమైన శివరామిరెడ్డి కాలనీ నుంచి కనేకల్ కు వెళ్లే రహదారి వరకు వార్డు సభ్యులు వసికేరి మల్లికార్జున సోమవారం వీధి దీపాలను ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు మాట్లాడుతూ శివరామి రెడ్డి కాలనీ నుంచి కనేకల్లుకు వెళ్లే రహదారి వరకు వీధి దీపాలు లేకపోవడం వల్ల ప్రజలు అనేక రోజులుగా ఇబ్బందులకి గురవుతున్నారని. రాత్రి సమయంలో విష పురుగుల సంచారం, ప్రజలు బయటికి రావడానికి ఇబ్బందికరంగా ఉండడంతో వారి యొక్క కష్టాలను ఇబ్బందులను గుర్తించి గ్రామపంచాయతీ యొక్క సహకారం మరియు నిధులతో వీధి దీపాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. వార్డు సభ్యులు వసికేరి కృషివల్ల వీధిలైట్లు ఏర్పాటు కావడంతో ఆ కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img