విశాలాంధ్ర -ధర్మవరం: పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళ చౌడేశ్వరి దేవి ఆలయంలో ఈనెల 27వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు నాలుగు రోజులు పాటు శ్రీ శాంత కళ చౌడేశ్వరి దేవి ప్రతిష్ట జరిగి 12 సంవత్సరాలు అయినా సందర్భంగా పుష్కరణోత్సవము, కుంభాభిషేకము కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం అధ్యక్షులు వెంకటేశులు( చిట్టి )గౌరవ అధ్యక్షులు గడ్డం పార్థసారథి,ఉపాధ్యక్షులు కాచర్ల నారాయణస్వామి, బంధనాదం ప్రకాష్, బండి ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి బందనాథం చిన్నికృష్ణ,సహాయ కార్యదర్శి బండి నాగరాజు, కోశాధికారి బంధనాదం వెంకటరమణ పేర్కొన్నారు. రెండవ రోజు మంగళవారం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ ప్రత్యేక పూజలను అర్చకులు అనిల్ ,తదితర అర్చక బృందం నిర్వహించారు. వేడుకల్లో శ్రీ,ఉదయం, సాయంత్రం మూల విగ్రహానికి పంచామృతాభిషేకం-,విశేష మంగళ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం, దేవ నాంది పూజ,పంచగవ్య పూజ, మహాగణపతి నవగ్రహ మూలమంత్ర జపములు, కలస స్థాపనతో పాటు గణపతి దుర్గాసూక్త పూర్వక దుర్గ హోమాలు, అర్చకులు యొక్క వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం ఈ వేడుకలు కుల గురువు శ్రీ దివ్య జ్ఞానానందగిరి స్వామి వారి పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది అని తెలిపారు.. తదుపరి మార్చి 1వ తేదీన ఉదయం మూలమంత్ర జపములు, అమ్మవారికి పంచామృతాభిషేకం, వివిధ హోమాలు, సాయంత్రం సుదర్శన మండల, ధన్వంతరి మూలమంత్ర హోమాలు, సాయంత్రం శ్రీ కోదండ రామాలయం భజన బృందం వారిచే అమ్మవారి భజన కార్యక్రమం, మార్చి రెండవ తేదీన అమ్మవారికి పంచామృతాభిషేకం, ప్రత్యేక అలంకరణ, వివిధ హోమాలు, కలశ ఉద్వాసన అపూర్వక మహా కుంభాభిషేకం కార్యక్రమాలు, సాయంత్రం 6 గంటలకు పంచమ జ్యోతుల ఉత్సవముతో పాటు అమ్మవారి గ్రామోత్సవం కూడా నిర్వహించబడును అని తెలిపారు. ఇదే రోజున అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందని తెలిపారు. కావున కుల బాంధవులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి సంఘం డైరెక్టర్లు పాల్గొన్నారు.