విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ శాఖా గ్రంధాలయం లో 8 వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరిగే వేసవి విజ్ఞాన శిబిరాలు సోమవారం లాంఛనంగా ప్రారంభించరు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సోమందేపల్లి లెక్కల టీచర్ .మరియు విశ్రాంత ఏ ఎస్సై లు విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.పిల్లలు వేసవిలో తమ సమయం వృధా చేయకుండా సెల్ ఫోన్లు వాడకుండా గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఒక మంచి పుస్తకం వేయి మిత్రులతో సమానం కనుక పుస్తక పఠనం తో విజ్ఞానం పెంచుకోవాలని అన్నారు.తలదించి పుస్తకం చదివితే జీవితంలో తల ఎత్తుకునెలా చేసేదే పుస్తకం అన్నారు.ఈ కార్యక్రమంలో విద్యాధికులు విద్యార్థులు గ్రంధాలయ అధికారి వేణు గోపాల్ పాల్గొన్నారు.