విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ శాఖా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిభిరాలను గ్రంథాలయ కార్యదర్శి రమ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి గ్రంధాలయంలో వేసవి శిక్షణ శిబిరాలు గురించి, అలాగే లోటుపాటులను అడిగి తెలుసుకొని, వేసవి శిక్షణా శిభిరాల నిర్వహణ పట్ల పలు అంశాలపై సూచనలు చేశారు. ఇందులో వేసవి శిక్షణా శిభిరాలకు వచ్చే విద్యార్థులకు, రిసోర్స్ పర్సన్స్ కు గ్రంథాలయ పాఠకులకు ఎండ, వేడి నుండి ఎలాంటి ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ బాషా, రిసోర్స్ పర్సన్ దాదా పీరా, విద్యార్థినీ విద్యార్థులు గ్రంథాలయ పాఠకులు పాల్గొన్నారు.