విశాలాంధ్ర -ఉరవకొండ : వైఎస్ఆర్సిపి పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132 వ జయంతి వేడుకలను శుక్రవారం ఉరవకొండలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ భారతదేశానికి చేసిన సేవలు మరువలేనివి అన్నారు. బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం ఆయన ఎనలేని కృషి చేశారన్నారు. ఆయన యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని అన్నారు.