Sunday, May 28, 2023
Sunday, May 28, 2023

వైసిపి ప్రభుత్వానికి చెంపపెట్టు… సిపిఐ నాయకులు జింకా చలపతి, మధు

విశాలాంధ్ర-ధర్మవరం : జీవో నెంబర్ వన్ నీ కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకా చలపతి, నియోజకవర్గ కార్యదర్శి మధు, సిపిఐ పట్టణ కార్యదర్శి రవికుమార్, సిపిఐ సహాయ కార్యదర్శి రమణ, తాలూకా చేనేత కార్మిక సంఘం కార్యదర్శి వెంకటనారాయణ, అధ్యక్షులు వెంకటస్వామిలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం వారు మాట్లాడుతూ ప్రాథమిక హక్కులను కాలరాసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం, విపక్షాలన్నీ విమర్శించిన జీవోను ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర ప్రజలంతా ఉద్యమాలు నిర్వహించినా ,ప్రభుత్వం పట్టించుకోలేదని చివరకు ఇప్పుడు హైకోర్టు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం నిజంగా గర్వించదగ్గ విషయమని, ఇది ప్రజా విజయమణి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా విచ్చేత ప్రదర్శించి ప్రతిపక్షాలను ప్రజాసంఘాలను గౌరవించాల్సిన బాధ్యత ఉందని వారు గుర్తు చేశారు. ప్రజా సమస్యల కొరకు వామపక్షాలు ప్రజా ఉద్యమాలు చేస్తుంటే, ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి, ఉక్కుపాదం మోపడం ఇకనైనా మానాలని వారు హితవు పలికారు. జీవో నెంబర్ ను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేసి హైకోర్టులో పిల్ వేయడం జరిగిందన్నారు. వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ తరచూ హైకోర్టుతో అర్చింతలు వేయించుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇది మరో వ్యక్తి ఎదురు దెబ్బ అని వారు తెలిపారు. జీవో నెంబర్ వన్ ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉందని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడుతూ జీవో కొట్టేస్తున్నట్టు తీర్పును తాము పూర్తిగా ఆహ్వానిస్తున్నామని, ఇది శుభదాయకమని వారు తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తూనే ఉంటుందని, తాము చేసే ప్రతి పోరాటం వెనుక ప్రజల యొక్క కష్ట సమస్యలు ఉన్నాయని వారు గుర్తు చేశారు. ఇకనైనా వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాలపై దృష్టి పెట్టి, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపాలని వారు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం బెదిరిస్తే బెదిరేది లేదని, ఎన్ని కేసులు కైనా తాము సిద్ధమని చివరకు జైలుకైనా వెళతామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img