Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

వైసిపి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించండి

యం.యల్.సి. వై.శివరామిరెడ్ది

విశాలాంధ్ర-ఉరవకొండ : వైఎస్ఆర్సిపి పార్టీ బలపరిచిన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూసల రవీంద్ర రెడ్డి మరియు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రారెడ్డి కి మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి మెజరిటీతో గెలిపించి జననేత జగనన్న పరిపాలనకు మరింత మద్దతు పలకాలని యం.యల్.సి వై.శివరామిరెడ్ది అన్నారు. మంగళవారం నియోజకవర్గములోని కొనకొండ్ల గ్రామంలో సచివాలయాల సిబ్బందిని మరియు భోజన విరామ సమయంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మహత్మా జ్యోతీరావ్ పూలే గురుకుల పాఠశాలలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను, ప్రతి పట్టభద్ర ఓటరుని కలిసి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సంధర్బంగా యం.యల్.సి వై.శివరామిరెడ్ది మాట్లాడుతూ
సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, అన్ని వర్గాల ప్రజలకీ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి బాటలు వేశారని ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు మద్దతు ఇవ్వాలని పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img