Friday, June 2, 2023
Friday, June 2, 2023

వైస్సార్ జలకళ మోటార్లు పంపిణీ

విశాలాంధ్ర- ఉరవకొండ : వైస్సార్ జలకళః పథకం కింద మంజూరైన బోరుబావి మోటార్ల ను ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి కొనాపురం,లత్తవరం,ఆమిద్యాల గ్రామాలకు చెందిన రైతులుకు గురువారం ఉరవకొండ మండలం మోపిడి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ భూముల్లో బోరుబావులను ఏర్పాటు చేసుకుని పంటలు సాగు చేసుకోవాలన్న రైతుల కలను ఃవైఎస్సార్ జలకళః తో ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి సాకారం చేశారన్నారు.బోరుబావి తవ్వకం మొదలు, విద్యుత్ కనెక్షన్, మోటారు పంపులను ఉచితంగా అందివ్వడంతో పాటు సబ్సిడీతో డ్రిప్ సౌకర్యం కల్పిస్తూ సీఎం జగన్ రైతు పక్షపాతిగా నిలిచారన్నారు.కార్యక్రమంల జలకళ టీఏ ఇషాక్,వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img