Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

శాంతియుత వాతావరణం లో రంజాన్ పండుగ నిర్వహించుకోవాలి

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ డి.ఎస్.పి హుస్సేన్ పీరా అద్వర్యములో పోలీస్ స్టేషన్ నందు గురువారం పెనుకొండ నందు గల అన్ని మసీదుల ముస్లిం మత పెద్దలను పిలిపించి రంజాన్ పండుగ ప్రశాంతముగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా చూడాలని పలు సూచనలు చేశారు. అటువంటి సంఘటనలు జరిగినయెడల పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని కావున ప్రతి ఒక్కరు స్నేహభావంతో ఈ పండుగ రంజాన్ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా జాగ్రత్త వహించాలని సూచించారుఈ కార్యక్రమములో పెనుకొండ ఎస్సై రమేష్ బాబు మరియు జమేదార్లు శ్రీనివాసులు, దదపీర్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img