విశాలాంధ్ర-గుంతకల్లు : 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పట్టణంలోని 32 వార్డులో షికారి కాలనీలో ఆ వార్డు కౌన్సిలర్ వై.సుధాకర్ దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వై సుధాకర్ మాట్లాడుతూ షికారి కాలనీలో వారికి అనేక సమస్యలు ఉన్నాయని జీవనాధారం కూడా అంతంత మాత్రమే ఉందన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తమ వంతు దుప్పట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మనో ప్రియ, శివ తదితరులు పాల్గొన్నారు.