Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ శివరామిరెడ్డి

విశాలాంధ్ర-ఉరవకొండ : ప్రజలందరికీ, ముఖ్యంగా ఉరవకొండ నియోజకవర్గం ప్రజలందరికీ ఎమ్మెల్సీ వై శివరామిరెడ్డి సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ తెలుగుజాతి సగర్వంగా జరుపుకునే అచ్చమైన తెలుగు పండగ సంక్రాంతి అని రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగు వాకిలన్నీ పండగ శోభాయమానంతో కళకళలాడుతూ అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడేలా ఈ పండుగ అందరికీ శుభాలను చేకూర్చాలని పండగ సందర్భంగా బంధువులు, మిత్రులు, ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, సంతోషంగా గడపాలని ముఖ్యంగా రైతులకు సకాలంలో వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండి ఆనందంగా ఉండాలని వారికి ఆర్థికంగా కలిసి రావాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పరిపాలనలో బడుగు బలహీన, పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టడానికి ఎంతో కృషి చేస్తున్నారని ఈ సంవత్సరం కూడా సంక్షేమ ఫలాలు అందరికీ చేరి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలందరూ అభివృద్ధిలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img