Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

సజావుగా జరిగిన అంగన్వాడి ఇంటర్వ్యూలు.. ఆర్డిఓ తిప్పే నాయక్

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయంలో బుధవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ధర్మవరం క్లస్టర్ పరిధిలోగల అంగన్వాడి టీచర్ల ఇంటర్వ్యూలు సజావుగా నిర్వహించినట్లు ఆర్డిఓ తిప్పే నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మవరం క్లస్టర్ పరిధిలో అంగన్వాడి టీచర్ల పోస్టులు ఆరు, మినీ అంగన్వాడీ టీచర్ల ఒకటి, హెల్పర్లు పోస్టులు ఐదు, మొత్తం వేసి 12 పోస్టులకు గాను 30 మంది మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నియమ నిబంధనల ప్రకారం ఇంటర్వ్యూలను నిర్వహించామని తెలిపారు. విద్యా అర్హత పట్టి అన్ని సర్టిఫికెట్లను కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందన్నారు. తదుపరి ఇంటర్వ్యూ జాబితా ను కలెక్టర్ కార్యాలయానికి పంపడం జరుగుతుందన్నారు. త్వరలోనే కలెక్టర్ కార్యాలయం ద్వారా అర్హులైన జాబితాను ప్రకటించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ లక్ష్మి, డిప్యూటీ డి ఎం ఎన్ హెచ్ ఓ సల్మాన్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img