Saturday, June 10, 2023
Saturday, June 10, 2023

సజావుగా జరిగిన వేలం పాట.. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున

విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం దినవారపు మార్కెట్ జంతు వలసల యొక్క బహిరంగ వేళము పాట సజావుగా నిర్వహించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున పేర్కొన్నారు. ఈ వేలంపాట మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల ,వైస్ చైర్మన్ లు భాగ్యలక్ష్మి, వెనుజురి నాగరాజుల ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ దినవారపు మార్కెట్, జంతు వదశాలకు, వేలం పాట దారులుగా రాఘవరెడ్డి, ఇబ్రహీం, ఖాజాముద్దీన్లు పాల్గొన్నారు అని తెలిపారు. దినవారపు మార్కెట్ గత సంవత్సరములో 30 లక్షలు సర్కారు పాట పాడగా అది 56 లక్షల 80000 కు వేలంపాట అధికంగా పాడిందన్నారు. మరి జంతువలసలకు గతంలో 20000 రూపాయలు వేలం పాట పాడగా అది 90 వేల రూపాయలు హెచ్చు పాటకు పాడటం జరిగిందన్నారు. మరి నేడు దినవారపు మార్కెట్ 35 లక్షలకు సర్కారు పాట పాడగా, అది 58 లక్షలకు హెచ్చుపాటగా ఎస్. రాఘవరెడ్డి కైవసం చేసుకున్నారని తెలిపారు. అదేవిధంగా జంతువదశాల కు సర్కారు పాట 90000 పాడగా అది హెచ్చు పాటలో పి. ఇబ్రహీం ఒక లక్ష 5వేల రూపాయలకు కైవసం చేసుకోవడం జరిగిందన్నారు. మొత్తం మీద గతంలో కన్నా ఈసారి కొంతవరకు మున్సిపల్ కార్యాలయానికి ఆదాయం వచ్చినట్లు వారు తెలిపారు. తదుపరి వేలంపాటదారులకు చట్టపరమైన నియమ, నిబంధనల యొక్క విషయాలను వారు తెలియజేశారు. ఈ శుంకాలు ఏప్రిల్ 1వ తేదీ నుండి31/3/2024 వరకు మాత్రమే రుసుములు వసూలు చేసుకునే హక్కును పొందుతారని తెలిపారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ,మేనేజర్ అండ్ ఆర్ వో.. ఆనందు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img