విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ శ్రీ సత్య సాయి సేవా సమితిలో ఉన్నటువంటి మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలు, వెంకటరెడ్డి పల్లి , తిమ్మాపురం , ఇస్లాపురం, పాఠశాలందు చదువుకొనుచున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు శుక్రవారం శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రశాంతి నిలయం నుండి వైద్య నిపుణులు గుణరంజన్ ,సాయి స్వరూప్, ఆధ్వర్యంలో దంత పరీక్షలు నిర్వహించారు వెంకటరెడ్డి పల్లి స్కూల్ నందు 27 మందికి, తిమ్మాపురం స్కూల్ నందు15 మందికి ఇస్లాపురం స్కూల్ నందు28 మందికి దంత సమస్యలు ఉన్నట్లు కనుగొని వారందరికీ టోకెన్లు ఇచ్చి30.4. 2023 ఆదివారము నాడు ఇస్లాపురంలో జరుగుతున్నటువంటి మెడికల్ క్యాంపుకు చికిత్స నిమిత్తం రావలసినదిగా తెలియజేసినారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాలల సిబ్బందికి, సత్యసాయి సేవాదల సభ్యులకు , సత్య సాయి తాలూకా సమితి అధ్యక్షులు శంకర్, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు,