Friday, March 31, 2023
Friday, March 31, 2023

సమస్యలు పరిష్కరించాలని విశ్రాంతి ఉద్యోగులు ఆందోళన

విశాలాంధ్ర -ఉరవకొండ : అపరిస్కృతంగా ఉన్న విశ్రాంతి ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం ఉరవకొండలో విశ్రాంతి ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ట్రెజరీ అధికారి కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్రాంతి ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షులు కె. కిష్టప్ప మాట్లాడుతూ రాష్ట్ర, జిల్లా యూనియన్ల ఆదేశాలు మేరకు సమస్యలు పరిష్కరించాలని శాంతియుత దశల వారి పోరాటాలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా పెన్షనర్లకు ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు 2018 జూలై 1 నుంచి బకాయి ఉన్న డిఎ ఆరియర్స్ సత్వరమే చెల్లించాలని, అలాగే ప్రస్తుత బకాయి ఉన్న డిఆర్ విడుదలకు ఉత్తర్వులు ఇవ్వాలని, 11వ పిఆర్సి అరియర్స్ ను వెంటనే చెల్లించాలని, పెన్షనర్లకు పే ఫిక్సివేషన్ స్టేట్మెంట్ ఇవ్వాలని మరియు 11వ పిఆర్సి లో ఉన్న అసంబద్ధతలు సవరణకు అనా మలీస్ కమిటీ ఏర్పాటు చేయాలని 2023 జూలై 1 నుంచి వేతన సవరణ అమలు చేయాల్సి ఉన్నందున తక్షణమే 12వ కమిషన్ ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ట్రెజరీ అధికారికి మరియు తాసిల్దార్ కు కూడా సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విశ్రాంతి ఉద్యోగులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img