Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అందుబాటులో…

: తహశీల్దార్ లక్ష్మినరసింహ

విశాలాంధ్ర-రాప్తాడు : రెవెన్యూ సమస్యలపై నిరంతరం అందుబాటులో ఉంటామని తహశీల్దార్ లక్ష్మీనరసింహ తెలిపారు. గురువారం ఆయన రాప్తాడు విలేకరులతో మాట్లాడారు. రెవెన్యూ పరంగా భూములకు సంబంధించి ఏమైనా సమస్యలు ఎదురైతే నేరుగా తహసిల్దార్ నే సంప్రదించాలని, పనులు చక్కపెడతామని ఎవరైనా మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాలలో రెవెన్యూ సమస్యలు ఉంటే అర్జీదారుడు నేరుగా తాహశీల్దారు ను కలిసి తమ సమస్యను వివరించాలని కోరారు. మధ్యవర్తులను ఎవరూ నమ్మవద్దన్నారు. మధ్యవర్తులు ఎవరైనా తహశీల్దారు కార్యాలయంలో మాకు తెలుసు అని రైతుల నుండి డబ్బులు తీసుకుంటున్నట్లు తెలిస్తే వారిపై క్రిమిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img