విశాలాంధ్ర-పెనుకొండ : మండల పరిధిలోని యర్రమంచిలో శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది,స్థానిక సర్పంచ్ నాగ మూర్తి వైస్ ఎంపీపీ రామాంజనేయులు ఎమ్మెల్యే శంకర్ నారాయణ కు ఘన స్వాగతం పలికి ఇంటింటికి వెళ్ళి ప్రజలతో సమస్యలు తెలుసుకున్నారు,వైసిపి పాలన ఎలా ఉంది,సంక్షేమ పథకాలన్ని అందుతున్నాయ అని సమస్యలూ వింటు వాటికి పరిష్కారం చూపుతు ముందుకెళ్ళారు వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు నేను విన్నాను నేను ఉన్నాను అనే సందేశంతో లబ్ధిదారులకు అందాల్సిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా తెలుసుకోవడానికి ఈ గడపగడప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు కొంతమంది లబ్ధిదారులు పెన్షన్లు మంజూరు చేయాలని వితంతు పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నామని అలాగే ఇంటి పట్టాలు గ్రామంలో త్రాగునీరు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని ఎమ్మెల్యే కు విన్నవించారు,ఈ కార్యక్రమంలో జెడ్పీటిసి గుట్టురు శ్రీరాములు,ఎంపిపి రాంమొహన్ రెడ్డి,పొగాకు రాంచంద్ర,శ్రీకాంత్ రెడ్డి,శ్యాంసుందర్ నాయక్ చెన్నకేశవుల కొండల రాయుడు,కన్వీనర్ బాబు డీలర్ మారుతి శ్రీనివాసులు మండల పరిషత్ అభివృద్ధి అధికారి శివశంకరప్ప, తదితరులు,ఎంపిటిసిలు,వాలంటీర్లు,సచివాలయ ఉద్యోగులు పాల్గోన్నారు.