Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

సర్జికల్‌ హాస్పిటల్‌ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వై.వి.ఆర్‌

విశాలాంధ్ర గుంతకల్లు : పట్టణంలో 60 అడుగుల రోడ్డులో నూతనంగా ఆశ సర్జికల్‌ క్లినిక్‌ సోమయాదులు హాస్పిటల్‌ ను గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్‌ సోమయాదులు మాట్లాడుతూ పట్టణంలో అనేక రోగులు వ్యాధుల సమస్యలపై ఆపరేషన్ల అత్యవసరాలకు అనంతపురం,కర్నూల్‌ ,బళ్లారి ఇతర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి గుంతకల్లు పట్టణంలో నెలకొంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ధనార్జనే ధ్యేయంగా ప్రైవేట్‌ ఆస్పత్రులు వెలుస్తున్నాయి.అన్ని ఆసుపత్రుల కాకుండా అందరికన్నా తక్కువ ఖర్చుతో వచ్చిన రోగులకు మెరుగైన చికిత్స అందిస్తామని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img